Header Banner

జలుబు, దగ్గు, జ్వరం ఉంటే మైకోప్లాస్మా న్యుమోనియాకు సూచన! వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచన!

  Thu Feb 20, 2025 12:46        Health

పిల్లలపై మైకోప్లాస్మా న్యుమోనియా(Mycoplasma pneumoniae) కేసులు పంజా విసురుతున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

- పెరుగుతున్న న్యుమోనియా కేసులు

- 15 ఏళ్లలోపు వారిపై ఎక్కువ ప్రభావం

- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

పిల్లలపై మైకోప్లాస్మా న్యుమోనియా(Mycoplasma pneumoniae) కేసులు పంజా విసురుతున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఏడాది నుంచి పదిహేనేళ్ల లోపు పిల్లలు దీని బారిన అధికంగా పడుతున్నారని చెబుతున్నారు. కాలేయం, మెదడుపై మైకోప్లాస్మా న్యుమోనియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే కొందరిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేయాలని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు దీర్ఘకాలికంగా తీవ్రమైన న్యుమోనియా కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: విజయవాడ రూట్లో టీజీఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్! బస్సు టికెట్లపై భారీ రాయితీలు!

దీర్ఘకాలిక మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్న పిల్లలకు కొన్నిసార్లు ఊపిరితిత్తుల పనితీరులో ఇబ్బందులు ఉంటాయని, బ్రాంకోస్కోపీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరించారు. మైకోప్లాస్మా న్యుమోనియా, ఇన్ల్ఫుయెంజా న్యుమోనియా కలిసి ఉంటే సమస్య తీవ్రం అవుతుందన్నారు. మైకోప్లాస్మా న్యుమోనియా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో కచ్చితమైన కారణాలు లేవని, అసాధారణ వాతావరణం ఓ కారణంగా భావించాల్సి ఉంటుందని వివరించారు.

న్యుమోనియాతో వచ్చే పిల్లల్లో గతంలో పది నుంచి 20 శాతం మైకోప్లాస్మా ఉంటే, ఇప్పుడు 60 నుంచి 80 శాతం ఆ కేసులే ఉంటున్నాయి. ఓపిలో దాదాపు 40 నుంచి 50 శాతం కేసులను చూస్తున్నాం. ఈ కేసులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయో కారణాలను స్పష్టంగా గుర్తించలేకపోతున్నాం. కొందరికి బ్రాంకోస్కోపి, ఇతర ప్రత్యేక వైద్యం అందించాల్సి ఉంటుంది. విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం ఉంటే అనుమానించి డాక్టర్‌కు చూపించాలి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #health #healthcare #cold #cough #fever #pneumoniae #Mycoplasma pneumoniae